Chicken Dum Biryani Recipe | చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం


కావల్సిన పదర్థాలు (Ingredients)

1. బాస్మతి బియ్యం (1/2 కేజీ)
2. కోడి మాంసం (1కేజీ)
3. బిర్యానీ మసాలాలు(మరాఠీ మొగ్గ (2), దల్చిని చెక్క, అనాసపువ్వు (2))
4. పెరుగు (3 చెంచాలు)
5. ఉప్పు (4 చెంచాలు)
6. ఉల్లిపాయలు (2 పెద్దవి)
7. పచ్చిమిర్చి (3)
8. ఎండుమిర్చి (10)
9.నిమ్మకాయ (1)
10. యాలకలు (4)
11. మిరియాలు (3)
12. లవంగాలు (4)
13. జీడిపప్పు (5)
14. కారం (1 చెంచా)
15. నూనె (5 చెంచాలు)
16. పుదీన (తగినంత)
17. కొత్తిమీర (తగినంత)
18. నెయ్యి (1 చెంచా)
19. అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 చెంచా)

తయారీ విధానం:

1) పొయ్యి వెలిగించి కడాయ్యి ఉంచి దానిలో 3 చెంచాలు నూనె వెయ్యాలి. నూనె కాగిన తరువాత మరాఠీ మొగ్గ (1), కొంచం దాల్చిన చెక్క, అనాశపువ్వు (1) వెయ్యాలి.

2) తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ (1), పచ్చిమిర్చి (3) వేసి వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 చెంచా) పచ్చివాసన పోయేవరకు వేయించాలి.

3) శుభ్రంగా కడిగిన కోడి మాంసంను వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత 3 చెంచాలు ఉప్పు వేసి మరీ కొద్దిసేపు ఉడకనివ్వాలి.

4) ఇప్పుడు మరాఠీ మొగ్గ (1), అనసపువ్వు (1), మిరియాలు (2), యాలకలు (3), లవంగాలు (3), ఎండుమిర్చి (10) మెత్తగా పేస్ట్ చేసి వుడుకుతున్న మాంసం లో వెయ్యాలి.

5) 10 నిమిషాల తరువాత కడయ్యి పొయ్యి పై నుంచి దించాలి. తరువాత 3 చెంచాలు పెరుగు 1 నిమ్మకయ రసం కూరలో వెయ్యాలి.

6) ఒక పాత్రలో 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 2 లీటర్ల నీరుపోసి యాలుక (1), లవంగం (1), మిరియం (1), చెంచా ఉప్పు (1) వేసి పొయ్యి పై పెట్టాలి. 10 నిమిషాలలో అన్నం వుడుకుపోతుంది అన్నపుడు పొయ్యి పై నుంచి దించాలి.

7) అడుగు మందంగా గల పాత్ర లో కొంచం కూర వేసి దానిపై కొంచం అన్నం పుదీన కొత్తిమీర వెయ్యాలి. దీని పై కూర మరల అన్నం పుదీన కొత్తిమీర జీడిపప్పులు వెయ్యాలి.

8) ఆవిరి బయటకి పోకుండా మూతపెట్టి దాని పై బరువు ఉంచి 20నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మొత్తం కలిపితే వేడి వేడి గా కోడి దం బిర్యని తయారవుతుంది

Post a Comment

0 Comments