Chicken Fry Piece Biryani Recipe | చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానము



కావలసిన పదార్థాలు (Ingredients):

1. ధనియాలు
2. షాజీరా
3. లవంగాలు
4. జాజి కాయ
5. దాల్చిన చెక్క
6. యాలుకలు
7. యండు మిర్చి
8. గస గసాలు
9. బాసుమతి రైస్
10. పసుపు
11. కళ్ళు ఉప్పు
12. అల్లం వెల్లులి పేస్ట్
13. చికెన్
14. నెయ్యి
15. ఉల్లిపాయ
16. పచ్చి మిర్చి
17. కారం
18. పుదీనా
19. కొత్తిమీర
20. కరివేపాకు
21. బిర్యానీ ఆకులు
22. యాలకుల పొడి
23. గోధుమ పిండి

తయారీ విధానము (recipe):

1) ముందుగా బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ధనియాలు, షాజీరా, లవంగాలు, జాజి కాయ, దాల్చిన చెక్క, యాలుకలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత 10 యండు మిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

2) ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గస గసాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్ని ఫ్రై అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నిటిని చల్లార్చుకుని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి.

3) ఒక కేజీ బాసుమతి రైస్ తీసుకుని శుభ్రముగా కడుక్కుని నానబెట్టుకోవాలి.

4) స్టవ్ మీద వాటర్ ఉంచి కొంచెం పసుపు, కొద్దిగా కళ్ళు ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని వాటర్ ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతూ ఉండగా ఒక కేజీ చికెన్ ని వాటర్ లో వేసుకుని ఉడికించుకోవాలి.

5) చికెన్ ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడకపెట్టిన నీటిలో చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఈ వాటర్ ని తర్వాత బిర్యానీ లోకి ఉపయోగించుకోవాలి.

6) ఒక మందపాటి పాత్ర తీసుకుని ఒక స్పూన్ నెయ్యి, 50 ml ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అర స్పూన్ పసుపు వేసుకుని వేగనివ్వాలి.

7) ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్కోవాలి. ముందుగా ఉడికించుకున్న చికెన్ ని ఇందులో వేసుకుని హై ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గనివ్వాలి.

8) చికెన్ ముక్కలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకుని రెండు నిముషాలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని సగం ఇందులో వేసుకుని హై ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

9) స్టవ్ పైన కడాయి ఉంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి కాగనివ్వాలి. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

10) స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత జీడి పప్పులు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

11) మనం ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ ని ఇందులో వేసుకుని రెండు నిముషాలు ఉడికించుకోవాలి. మనం తయారు చేసుకున్న మసాలా ని కూడా ఇందులో వేసుకుని రైస్ కి పట్టేలాగా కలుపుకోవాలి.

12) రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ఉడకపెట్టిన వాటర్ ని వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ కి 1 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కళ్ళు ఉప్పు, కొద్దిగా నిమ్మ రసం వేసుకుని 5 నిముషాలు ఉడికించుకోవాలి.

13) ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మీద ఒక లేయర్ గా ఫ్రై చేసుకున్న రైస్ ని వేసుకోవాలి. రైస్ పైన జీడి పప్పులు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి.

14) ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా మూత అంచుల దగ్గర గోధుమ పిండి తో సీల్ చేసుకోవాలి. వీడియో లో చూపించిన విధంగా చేయండి.

15) 20 నిముషాలు లో ఫ్లేమ్ లో స్టవ్ ఆన్ చేసి దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 నిముషాలు చల్లారనివ్వాలి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ!


Post a Comment

0 Comments