Fish Gravy Curry Recipe | చేపల పులుసు తయారీ విధానము



కావలసిన పదార్థాలు (Ingredients):

1. చేప ముక్కలు (1/2కేజీ)
2. ఉప్పు
3. కారం
4. పసుపు (చిటికెడు)
5. గరంమసాలా (2 స్పూన్స్)
6. ఉల్లిపాయలు (2)
7. పచ్చి మిపకాయలు (6)
8. కొత్తిమీర
9. కర్వేపాకు

తయారీ విధానము (Recipe):

1) ఒక బౌల్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు వేసి, కొద్దిగా నీటిని పోసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత చేప ముక్కలను అందులో వేసుకుని మసాలాలు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.

2) ఒక మిక్సీ జార్లో మూడు లవంగాలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు టమాటా ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

3) స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ని వేసి రెండు వైపులా ఐదు నిమిషాలు వేయించుకోవాలి. చేప ముక్కలు వేగిన తరువాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

4) అదే ఆయిల్ లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి.

5) తరువాత  మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ ని వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. కర్రీ లో నూని పైకి తేలుతూ ఉండంగా కళ్ళు ఉప్పు, కారం, పాచి మిర్చి వేసుకోవాలి.

6) 5 నిముషాలు తర్వాత చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వాటర్ రెండు కప్ లు ఇందులో పోసుకుని 5 నిముషాలు ఉడికించుకోవాలి. మనం ముందుగా వేపుకున్న ఫిష్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి.

7) పులుసు చిక్కపడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది.


Post a Comment

0 Comments