కావల్సిన పదార్థాలు (Ingredients):
1. పన్నీర్ (400 g)
2. నూనె (4 చెంచాలు)
3. లవంగం (2)
4. యలుకలు (2)
5. ఉల్లిపాయ (1 పెద్దది)
6. పచ్చిమిర్చి (4)
7. టమాటా (4)
8. ఉప్పు (2)
9. కారం (2)
10. గరం మసాలా (చెంచా)
11. కొత్తిమీర (కొద్దిగా)
12. అల్లం వెల్లల్లి పేస్ట్ (1 చెంచా)
13. జీలకర్ర (1 చెంచా)
తయారీ విధానం:
1) పొయ్యి పై కడాయ్యి ఉంచి 1 చెంచా నూనె వెయ్యాలి. పనీర్ ను చిన్న క్యూబ్స్ గా తీసుకుని నూనె లో రంగు మరేవరకు (గోల్డెన్ బ్రౌన్) వేయించి పకకు తీసుకోవాలి.
2) కడాయ్యి లో చెంచా నూనె వేసి కాగిన తరువత 2 లవంగాలు 2 యాలకలు వేసి 1 ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. వేగిన తరువాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 పచ్చిమిర్చి 4 టమాటా లను ముక్కలుగా తేసుకుని వెయ్యాలి.
3) 5 నిమిషాలు మగ్గనివ్వాలి.తరువాత కడాయి లో ఉన్నవాటిని మిక్సీ వేసి మెత్తని పేస్ట్ వస్తుంది.
4) కడాయి లో 2 చెంచాలు నూనె వేసి కాగిన తరువాత ఒక చెంచా జీలకర్ర వేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ను వేసి 5 నిమిషాల తరువాత 2 చెంచాలు ఉప్పు 2 చెంచాలు కారం చెంచా గరం మసాల పొడి వెయ్యాలి. ఈ మిశ్రమం నుండి నూనె పై కి తేలుతుంది.
5) మనం ముందుగా వేపిన పన్నీర్ ను 1 గ్లాస్ నీటి ని వెయ్యాలి. 10 నిమిషాలు తరువాత గుజ్జు గా (మనకు కావల్సిన విధంగా) వచ్చిన తరువాత కొత్తిమీర వేస్తే పన్నీర్ మసాల కర్రీ తయారు అవుతుంది.
0 Comments