Village style Fish Gravy curry recipe | చేపల పులుసు తయారీ విధానము



కావలసిన పదార్థాలు (Ingredients):

1. నూనెె (2టేబుల్ స్పూన్)
2. చింతపండు (10g)
3. కారం 
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ (1టేబుల్ స్పూన్)
5. చేప ముక్కలు (1/2 కేజీ)
6. ఉల్లిపాయ(1)
7. పచ్చిమిర్చి (3)
8. పసుపు 
9. ఉప్పు (చిటికెడు)
10. టమాటాలు (2)
11. కొత్తిమీర 
12. కరివేపాకు

తయారీ విధానం:

1) ఒక సట్టి తీసుకుని దానిలో శుభ్రంగా కడిగిన చేపముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు (ప్యూరీ), పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా ముక్కలకు పట్టించాలి.

2) తర్వాత రుచికి సరిపడా కారం వేసి బాగా కలిపి, స్టవ్ పైన పెట్టి  రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తరువాత కర్రీలో కొద్దిగా నీళ్లు పోసి సన్నని సెగపై ఉడికించుకోవాలి.

3) 20 నిమిషాలు ఉడికిన తరువాత ఒక కప్పు చింతపండు గుజ్జు, అర కప్పు నీళ్లు వేసి హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడిన తరువాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది.

4) వేడి వేడి అన్నంతో  సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేపల కూర ఇష్టపడని వాళ్లు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టపడతారు.

Post a Comment

0 Comments