కావలసిన పదార్థాలు (Ingredients):
1. చికెన్ (500g)
2. ఉప్పు
3. కారం
4. పసుపు (చిటికెడు)
5. ఉల్లిపాయ (1)
6. పచ్చిమిర్చి (4)
7. కొబ్బరి (50g)
8. పెరుగు (2 స్పూన్స్)
9. గసగసాలు (2 స్పూన్స్)
10. జీడిపప్పులు (6)
11. యాలకలు
12. వెల్లుల్లి (3)
13. అల్లం (2 inches)
14. ఆయిల్ (2 టేబుల్స్ స్పూన్స్)
15. టమాటా (2)
16. కొత్తిమీర
17. నిమ్మకాయ (1)
తయారీ విధానం:
1) ఒక బౌల్లో చికెన్ తీసుకుని ఉప్పు, కారం, పెరుగు, పసుపు వేసి చికెన్ కి బాగా పట్టించి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి.
2) గంట ముందు గసగసాలు జీడిపప్పులను నానబెట్టుకోవాలి. నానబెట్టిన గసగసాలు జీడిపప్పు లను మిక్సీ జార్ లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్ లో యాలుకలుు, లవంగాలు, వెల్లుల్లి రెమ్మలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3) స్టవ్ పైన కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
4) ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
5) టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ని (paste) వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
6) కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని అరకప్పు నీళ్లు వేసి కొబ్బరి నుండి పాలను వేరు చేయాలి. కొబ్బరి పాలను కర్రీ లో వేసి బాగా కలిపి మూతపెట్టి పులుసు చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి.
7) కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
0 Comments