కావలసిన పదార్దాలు (Ingredients):
1. జీడీ పప్పులు
2. నెయ్యి
3. కిస్మిస్
4. కొబ్బరి పొడి
5. పంచదార
6. పాలు
7. బొంబాయి రవ్వ
8. పుచ్చకాయ సీడ్స్
తయారీ విధానము (Recipe):
1) స్టవ్ మీద ఒక పాత్ర ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడీ పప్పు పలుకులు, కిస్మిస్ అందులో వేసి వేయించుకోవాలి. జీడీ పప్పు, కిస్మిస్ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2) అదే పాత్ర లో ఒక కప్ బొంబాయి రవ్వ (sooji) వేసి పచ్చి వాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. రవ్వ కలర్ మారిన తర్వాత కొబ్బరి పొడిని అందులో వేసి రెండు నిముషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
3) చల్లారిన రవ్వలో హాఫ్ కప్ పంచదార, పుచ్చకాయ సీడ్స్, ముందుగా వేయించి పెట్టుకున్న జీడీ పప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా ఇందులో కలుపుకుంటూ ఉండలుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి.
4) ఏ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డులుగా చుట్టుకుంటే రవ్వ లడ్డులు రెడీ అవుతాయి. ఏదైనా ఎయిర్ ఫ్రీ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.

0 Comments