1. చేపముక్కలు (1/2 కేజీ)
2. ఉప్పు (1 స్పూన్)
3. కారం (1 స్పూన్)
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 స్పూన్)
5. పసుపు (చిటికెడు)
6. నిమ్మకాయ (1)
7. ఉల్లిపాయలు (2 స్లైసెస్)
8. నూనె (డీప్ ఫ్రై కి సరిపడా)
9. గరం మసాలా( అర స్పూన్)
తయారీ విధానం:
1) ఒక బౌల్లో ఉప్పు, కారం ,అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మకాయ రసం, గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి.
2) ఈ మసాలా లో చేపముక్కలు వేసి చేప ముక్కలకు మసాలా బాగా పట్టించాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో మూడు నుండి నాలుగు గంటలు పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి.
3) స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టి కాగిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చేపముక్కలను వేసి రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
4) అంతే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది

0 Comments