1. చికెన్ (1/2 కేజీ)
2. ఉప్పు (అర స్పూన్)
3. కారం (1 స్పూన్)
4. గరం మసాలా (1 స్పూన్)
5. గుడ్డు (1)
6. నిమ్మరసం (1)
7. నూనె (డీప్ ఫ్రై కి సరిపడా)
తయారీ విధానం:
1) గిన్నెలో చికెన్ తీసుకుని ఉప్పు, కారం, గరం మసాలా, గుడ్డు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత చికెన్ ని రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. మారినేషన్ వలన చికెన్ చాల టేస్టీగా ఉంటుంది.
2) ఒక కడాయి స్టవ్ పై ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి కాగిన తరువాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ని నూనెలో వేసి మంచి రంగు వచ్చేదాకా అన్ని వైపులా వేపుకోవాలి.
3) మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి లేదంటే బయట లోపల చికెన్ సరిగా ఉడకదు. ఇలా చేస్తే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఉల్లిపాయలు, నిమ్మకాయ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

0 Comments