Veg Manchuriya Recipe | వెజ్ మంచురియ తయారీ విధానము



కావలసిన పదార్థాలు (Ingredients):

1. క్యాబేజ్ (1)
2. క్యారెట్(3)
3. ఉల్లిపాయలు (2)
4. పచ్చిమిర్చి (3)
5. ఉప్పు 
6. కారం 
7. అల్లం వెల్లుల్లి పేస్టు (1 స్పూన్)
8. ఉల్లికాడలు 
9. మిరియాల పొడి (2 స్పూన్స్) 
10. కార్న్ ఫ్లోర్ (1 కప్)
11. మైదా (1కప్)
12. గరం మసాలా (1 స్పూన్)
13. కొత్తిమీర 
14. నూనె (డీప్ ఫ్రై కి సరిపడా)
15. టొమాటో సాస్ (1 స్పూన్)
16. గ్రీన్ చిల్లీ సాస్ (1 స్పూన్)
17. షేజ్వాన్ సాస్ (1 స్పూన్)
18. సోయా సాస్ (1 స్పూన్)
19. వెనిగర్ (1 స్పూన్)

తయారీ విధానం:
 
1) ఒక పాత్రలో లో క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడలు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

2) తరువాత  మైదా కార్న్ ఫ్లోర్ వేసి బాగా నలుపుతూ కలుపుకోవాలి. క్యాబేజ్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

3) స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి కాగిన తరువాత  మనం ముందుగా రెడీ చేసిన మంచూరియా బాల్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి. మంచూరియా బాల్స్ ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.

4) స్టవ్ పైన కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత సాజీర, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి  30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి.

5) ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తరువాత  షేజ్వాన్ సాస్, చిల్లి సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాస్లు ఫ్రై అయిన తరువాత మనం ముందుగా ఫ్రై చేసిన మంచూరియా బాల్స్ ను వేసి 2 నిముషాలు కుక్ చేసుకోవాలి.

6) తర్వాత 1  స్పూన్ మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకుని చేసుకుంటే వెజ్ మంచూరియా రెడీ అవుతుంది. ఈ వెజ్ మంచూరియా ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది.


Post a Comment

0 Comments