Scrambled Fish Recipe | చేపల పిడుపు తయారీ విధానము



కావలిసిన పదార్ధాలు (Ingredients):

1. చేపలు
2. ఒక టీ స్పూన్ పసుపు
3. 2 స్పూన్స్ ఉప్పు
4. 2 స్పూన్స్ కారం
5. పచ్చి మిర్చి
6. ఉల్లిపాయలు
7. అల్లం వెల్లులి పేస్ట్
8. కర్వేపాకు

తయారీ విధానము (Recipe):

1) ఒక బౌల్ లో సరిపడా వాటర్ తీసుకుని బొయిల్ చేసుకోవాలి. వాటర్ కాగిన తర్వాత చేపలు, ఒక టీ స్పూన్ పసుపు నీటిలో వేసుకుని ఒక 10 నిముషాలు ఉడకపెట్టుకోవాలి. చేప ముక్కలు ఉడికిన తర్వాత నీటిని వేరు చేస్కుని చేప ముక్కలని చల్లారనివ్వాలి.

2) చల్లారిన చేపల నుంచి ముళ్ళని (bones) వేరు చేసుకోవాలి. ముళ్ళని తీసేసాక ఆ మిగిలిన చేప పిడుపుని పిండితే ఉడకపెట్టేటపుడు పీల్చుకున్న వాటర్ బయటకి వచ్చేస్తాయి. వాటర్ పిండటం వల్ల కర్రీ పొడిగా ఉండి చాలా బాగుంటుంది.

3) ఆ తర్వాత 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. చేప లో ముళ్ళు ఏమైనా ఉండిపోతే కారం కలిపాక ఈజీగా తీసేసుకోవచ్చు.

4) ఇపుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేస్కుని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి.

5) తరువాత మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప పిడుపుని ఇందులో వేసుకుని బాగా కలిపి ఒక 10 నిముషాలు ఉడికించుకోవాలి. కర్రీ అడుగు అంటి మాడిపోకుండా ఉండాలంటే అపుడప్పుడు కర్రీ ని తిప్పుతూ ఉండాలి.

6) ఆ తర్వాత కొద్దిగా కర్వేపాకు వేసి ఒక 5 నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడి వేడి అన్నం లో తింటే చాలా బాగుంటుంది.


Post a Comment

0 Comments