కావలసిన పదార్థాలు (Ingredients):
1. చికెన్
2. ఉప్పు
3. నిమ్మరసం
4. అల్లం వెల్లులి పేస్ట్
5. కారం
6. పసుపు
7. జీరా పొడి
8. ధనియాల పొడి
9. గరం మసాలా
10. జొన్న పిండి
11. వెనిగర్
12. సొయా సాస్
13. రెడ్ చిల్లి సాస్
14. గ్రీన్ చిల్లి సాస్
15. ఉల్లిపాయ
16. పచ్చి మిర్చి
17. జీడి పప్పు
18. కరివేపాకు
19. అల్లం వెల్లులి ముక్కలు
20. ఫుడ్ కలర్
21. టమాటో సాస్
22. కొత్తిమీర
23. స్ప్రింగ్ ఆనియన్స్
తయారీ విధానము (Recipe):
1) 750gms చికెన్ తీసుకుని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఒక గంట మేరీనెట్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్, రెండు స్పూన్స్ కారం, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీరా పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని చికెన్ కి మసాలా లు బాగా పట్టించాలి.
2) మసాలాలు చికెన్ కి పట్టిన తర్వాత ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సొయా సాస్, ఒక కప్ జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అసలు వేసుకోకూడదు.
3) స్టవ్ పైన కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత మనం మిక్స్ చేసిన చికెన్ ని ఒక్కొక పీస్ గా వేసుకోవాలి. చికెన్ మొత్తం కలర్ చేంజ్ అయినా తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
4) ఇపుడు సాస్ లు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి ఉంచి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లులి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
5) అల్లం వెల్లులి ఫ్రై అయినా తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసుకుని 30 సెకండ్స్ ఫ్రై చేస్కోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత జీడి పప్పు పలుకులు, కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
6) ఇపుడు ఒక స్పూన్ సొయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ రెడ్ చిల్లి సాస్, ఒక స్పూన్ గ్రీన్ చిల్లి సాస్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సాస్ లు ఫ్రై అయినా తర్వాత పావు స్పూన్ ఫుడ్ కలర్, ఒక స్పూన్ టమాటో సాస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
7) జొన్న పిండి ని ఒక కప్ నీటిలో కలిపి ఏ మరుగుతున్న సాస్ లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కరగనివ్వాలి. ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ని ఇందులో వేసుకుని ఈ సాస్ లన్ని బాగా పట్టించాలి.
8) చికెన్ కి సాస్ లు మొత్తం పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకుని ఒక 30 సెకండ్స్ కుక్ చేసుకోవాలి. చివరిగా తగినంత నిమ్మరం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నిమ్మరసం వాళ్ళ చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైడ్ చికెన్ రెడీ!

0 Comments