కావలసిన పదార్థాలు (Ingredients):
1. బటర్
2. యాలకలు
3. లవంగం
4. దాల్చిన చెక్క
5. జాపత్రి
6. ఉల్లిపాయ
7. పచ్చి మిర్చి
8. అల్లం వెల్లులి పేస్ట్
9. టమాటో పేస్ట్
10. పసుపు
11. జీల కర్ర పొడి
12. ధనియాల పొడి
13. ఉప్పు
14. కారం
15. జీడి పప్పులు
16. గస గసాలు
17. పెరుగు
18. పన్నీర్
19. గరం మసాలా
20. కోతిమేర
తయారీ విధానము (Recipe):
1) స్టవ్ పైన కడాయి ఉంచి రెండు టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఒక యాలుక, లవంగం, దాల్చిన చెక్క, జాపత్రి వేసుకుని వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేసుకుని మగ్గనివ్వాలి.
2) ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో లను పేస్ట్ చేస్కుని రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3) ఆయిల్ పైకి తేలుతూ ఉండగా అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ వేయించిన జీల కర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, రుచి కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేస్కోవాలి.
4) పది జీడి పప్పులు, రెండు స్పూన్స్ గస గసాలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుని 5 నిముషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి.
5) ఒక కప్ పెరుగు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి 5 నిముషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. పన్నీర్ ని తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా నలుపుకోవాలి. నలిపిన పన్నీర్ ముక్కలని ఇపుడు వేసుకోవాలి.
6) లో ఫ్లేమ్ లో మధ్య మధ్య లో కలుపుకుంటూ 10 నిముషాలు కుక్ చేసుకోవాలి. పన్నీర్ కుక్ అయి బటర్ పైకి తేలిన తర్వాత అర స్పూన్ గరం మసాలా, కొద్దిగా కోతిమేర తరుగు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

0 Comments