Kakarakaya fry recipe | కాకరకాయ వేపుడు తయారీ విధానం



కావల్సినపదార్థాలు:

1. కాకరకాయలుు (6)
2. ఉల్లిపాయలు (3)
3. పచ్చిమిర్చి (2)
4. ఉప్పు 
5. కారం 
6. నూనె (3 టేబుల్ స్పూన్స్)
7. మజ్జిగ (1  గ్లాస్)
8. చింతపండు (కొద్దిగా)
9. పసుపు (1 స్పూన్)
10. వేపిన శనగపప్పు (2 టేబుల్ స్పూన్)
 11. ధనియాలు (1 టేబుల్ స్పూన్)
12. జీలకర్ర (1 స్పూన్)
13. వెల్లుల్లి రెమ్మలు (6)
14. కర్వేపాకు
15. ఆవాలు (1/2 స్పూన్)

తయారీ విధానం:

1) ఒక పాత్ర తీసుకుని దానిలో 1 గ్లాస్ మజ్జిగ, నిమ్మకాయ, చింతపండు, ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు వేసి  శుభ్రంగా కడిగిన కాకరకాయలు వేసుకోవాలి. ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి  15 నిమిషాలు హై ఫ్లేమ్  లో ఉడికించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.

2) ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేపిన శనగపప్పుు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెమ్మలు, పసుపు వేసి కొద్దిగా బరకగా మిక్సి వేసుకోవాలి. ఈ పౌడర్ ని బౌల్ లోకి తీసుకుని వన్ స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి.

3) ముందుగా ఉడకపెట్టిన కాకరకాయలో నుండి గింజలు తీసేసి మనం రెడీ చేసిన  పౌడర్ ని కాకరకాయలో పెట్టుకోవాలి.

4) ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి  కాగిన తరువాత కాకర కాయలు వేసి  బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి  చిటపటలాడిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి.

5) ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మిగిలిన దినుసుల పౌడర్ని వేసి  ఐదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకొన్న కాకరకాయ వేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది.


Post a Comment

0 Comments