Gongura Mutton Recipe | గుంగోర మటన్ తయారీ విధానం


కావలసిన పదార్థాలు (Ingredients):

1. గోంగూర  (1కప్ ఉడకబెట్టినది)
2. మటన్ (1/2కేజీ)
3. ఉల్లిపాయలు (2)
4. పచ్చిమిర్చి (4)
5. ఆయిల్ (1 టేబుల్ స్పూన్)
6. లవంగాలు (2)
7. యాలుకలు (2)
8. బిర్యానీ ఆకు (2)
9. జాపత్రి(1)
10. నెయ్యి (1 టేబుల్ స్పూన్)
11. దాల్చిన చెక్క (2)
12. ఉప్పు (సరిపడ)
13. కారం (సరిపడ)
15. జీలకర్ర పౌడర్(1/2 స్పూన్)
16. ధనియాల పౌడర్(1/2 స్పూన్)
17. బేకింగ్ సోడా (1/2స్పూన్)
18. కొత్తిమీర 
19. కరివేపాకు 
20. గరం మసాలా(1 స్పూన్) 

తయారీ విధానం (Recipe):

1) స్టవ్ పైన కడాయి పెట్టి శుభ్రంగా కడిగిన గోంగూర వేసి కొద్దిగా నీటిని వేసి  మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.

2) గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత 1స్పూన్  సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.

3) గోంగూర ఉడికిన తరువాత పప్పు గుత్తి తో మెత్తగా నలుపు కోవాలి.

4) స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్స్ స్పూన్  ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి.

5) ఆయిల్ కాగిన తరువాత 2 లవంగాలు, 2 యాలకలు, 2 దాల్చిన చెక్క, 1 జపత్రీ, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.

6) సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.

7) ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత  అర స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

8) తరువాత శుభ్రంగా కడిగిన మటన్ ని వేసి  బాగా కలిపి 5 నిముషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.

9) ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి  ఇంకొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి.

10) ఇప్పుడు   మటన్ లో అర స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా  కలిపి ఇంకొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి.

11) ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ గసగసాలు, 10 జీడిపప్పులు, ఒక పెద్ద సైజు టమోటా ముక్కలు వేసి  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన గసగసాల పేస్ట్ ని మటన్ లో వేసి  బాగా కలిపి  20 నిమిషాలు ఉడికించుకోవాలి.

12) ఇప్పుడు  రుచికి సరిపడా కారం వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.

13) తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టిన గోంగూర వేసి  బాగా కలిపి మరొక 15 నిమిషాలు ఉడికించుకోవాలి.

14) చివరిగా 1 స్పూన్  గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి  స్టవ్ ఆఫ్ చేస్తే గోంగూర మటన్ కర్రీ రెడీ అవుతుంది.


Post a Comment

0 Comments