కావలసిన పదార్థాలు (Ingredients):
1. వాము (1 1/2 స్పూన్)
2. ఉప్పు (1 స్పూన్)
3. సెనగపిండి (1 cup)
4. కారం (1/2 స్పూన్)
5. బేకింగ్ సోడా (1/2 స్పూన్)
6. బియ్యపిండి (1 స్పూన్)
7. ఉల్లిపాయలు (1)
8. చాట్ మసాలా
9. నిమ్మ రసం
10. కొత్తిమీర
తయారీ విధానము (Recipe):
1) ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ వాము, అర స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ సెనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. బజ్జి మిరపకాయలు తీసుకుని ఒక చీలిక పెట్టుకోవాలి. ఈ చీలిక లో ముందుగా కలిపిన వాముని మిర్చిలో పెట్టుకోవాలి.
2) ఒక బౌల్ తీసుకుని ఒక కప్ సెనగపిండి, అర స్పూన్ వాము, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇపుడు అర స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ బియ్యపిండిని వేసి బాగా కలుపుకోవాలి.
3) కడాయి లో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న మిరపకాయలను సెనగపిండి మిశ్రమం లో ముంచి ఆయిల్ లో వేసుకోవాలి.
4) మీడియం ఫ్లేమ్ లో బజ్జీలు గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత ఈ బజ్జీలను మళ్ళి సెనగపిండి లో ముంచి రెండో సరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
5) బజ్జీలు ఫ్రై అయినా తర్వాత ఒక చీలిక పెట్టుకుని ఉల్లిపాయలు, చాట్ మసాలా, నిమ్మ రసం, కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.
0 Comments