Potato Cheese Rolls recipe | పొటాటో చీజ్ రోల్స్ తయారీ విధానము



కావలసిన పదార్థాలు (Ingredients):

1. బంగాళాదుంపలు (4)
2. చిల్లి ఫ్లేక్స్ (2 spoons)
3. పెప్పర్ పౌడర్ (1 spoon)
4. సాల్ట్ (1 spoon)
5. చీజ్
6. కోడి గుడ్డు (1)
7. బ్రెడ్ (2 pieces)

తయారీ విధానము (recipe):

1) ఒక బౌల్ లో ఉడికించిన బంగాళాదుంపలు తీసుకుని మెత్తగా స్మాష్ చేస్కుకోవాలి. ఇందులో ఒక స్పూన్ చిల్లి ఫ్లేక్స్, అర స్పూన్ పెప్పర్ పౌడర్, రుచిగా సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి.

2) చీజ్ ని వీడియో లో చూపించిన విధముగా బారుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని చీజ్ చుట్టూ పెట్టాలి. ఏమైనా డౌట్ ఉంటె కింద ఉన్న వీడియో చుడండి. చీజ్ బార్స్ అన్నిటిని రోల్స్ లాగ రెడీ చేసుకోవాలి.

3) ఒక కోడి గుడ్డు ని స్మాష్ చేస్కుని అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా చిల్లి ఫ్లక్స్, అర స్పూన్ పెప్పర్ పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ ని పొడిలాగా నిలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

4) ముందుగా రెడీ చేసుకున్న చీజ్ రోల్స్ ని ఎగ్ మిశ్రమం లో ముంచి మేతగా నలుపుకున్న బ్రెడ్ ని దీని పైన లేయర్ ల వేసుకోవాలి. బ్రెడ్ లేయర్ వేసుకోవటం వలన రోల్స్ క్రిస్పీ గా కర కర లాడుతూ ఉంటాయి

5) స్టవ్ పైన కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ముందు గా రెడీ చేసుకున్న చీజ్ రోల్స్ ని వేసుకోవాలి. అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

6) ఫ్రై అయినా తరువాత టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే పొటాటో చీజ్ రోల్స్ చాలా బాగుంటాయి.


Post a Comment

0 Comments