కావలసిన పదార్థాలు (Ingredients):
1. కొబ్బరి ముక్కలు
2. బెల్లం తురుము
3. నెయ్యి
4. జీడి పప్పు
5. యాలకుల పొడి
6. పాలు
7. పంచదార
8. బొంబాయి రవ్వ
9. నెయ్యి
తయారీ విధానము (Recipe):
1) ఒక కప్ కొబ్బరి ముక్కలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి ఉంచి అర కప్ బెల్లం తురుము, కొంచెం వాటర్ వేసుకుని బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుముని వేసుకుని 10 నిముషాలు ఉడికించుకోవాలి.
2) కొబ్బరి కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి, జీడి పప్పు పలుకులు, ఒక స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
3) స్టవ్ పైన బాండీ ఉంచుకుని ఒకటిన్నర కప్ పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్స్ పంచదార వేసుకుని కరిగించుకోవాలి.
4) పంచదార కరిగిన తర్వాత ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో 5 నిముషాలు ఉడికించుకోవాలి.
5) రవ్వ సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి.
6) ఈ పిండి ని తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ఉండలు చుట్టూ ఒక లేయర్ లాగా చుట్టుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటె కింద ఉన్న వీడియో చూస్తూ చేయండి.
7) స్టవ్ పైన కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ ని ఆయిల్ లో వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
0 Comments