Fruit Custard Recipe | ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానము



కావలసిన పదార్దాలు (Ingredients):

1. పాలు
2. పంచదార
3. కస్టర్డ్ పౌడర్
4. యాలకుల పొడి
5. ఫ్రూట్స్

తయారీ విధానము (Recipe):

1) స్టవ్ పైన ఒక బౌల్ ఉంచి అర లీటరు పాలు మరిగించుకోవాలి. పాలు కాగిన తర్వాత 200 గ్రాములు పంచదార పాలలో వేసి కరగనివ్వాలి. ఇంకో పావు లీటరు పాలలో 50 గ్రాములు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

2) కాచుకుంటున పాలలో పంచదార కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని వేసుకుని 10 నిముషాలు లో ఫ్లేమ్ లో ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. ఒక స్పూన్ యాలకుల పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

3) ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రెండు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఫ్రూట్స్ ని కట్ చేసి కస్టర్డ్ లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.


Post a Comment

0 Comments