Ridge Gourd Chutney recipe | బీరకాయ తొక్కు పచ్చడి తయారీ విధానం



కావలసిన పదార్థాలు (Ingredients):
 
1. బీరకాయ తొక్కులు 
2. బీరకాయ (1 చిన్నది)
3. టమాటా (1)
4. పచ్చిమిర్చి (10)
5. వెల్లుల్లి రెమ్మలు (8)
6. చింతపండు ( నిమ్మకాయ సైజ్ అంత)
7. ఆయిల్ (2  టేబుల్స్ స్పూన్స్)
8. జీలకర్ర (2 స్పూన్స్)
9. ఆవాలు (1 స్పూన్)
10. ఎండుమిర్చి (2)
11. కరివేపాకు 
12. పసుపు (చిటికెడు)

తయారీ విధానం (Recipe):
 
1) పొయ్యి మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి  కాగిన తరువాత పది పచ్చిమిర్చి వేసి దోరగా  వేయించుకోవాలి.

2) పచ్చిమిర్చి వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన బీరకాయ తొక్కు వేసి  5 నిమిషాలు మగ్గనివ్వాలి.

3) తరువాత బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.

4) ఇప్పుడు చింతపండు కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

5) ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి  రుచికి సరిపడా ఉప్పు నాలుగు వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర వేసి  కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

6) పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి 1 టేబుల్స్ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తరువాత 1 స్పూన్ ఆవాలు, 1  స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండు మిర్చి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి  కాసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి  ఈ పోపు ని పూర్తిగా చల్లారనివ్వాలి.

7) ఈ చల్లారిన పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసిన బీరకాయ తొక్కు పచ్చడి లో వేసి బాగా కలుపుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అవుతుంది.


Post a Comment

0 Comments