Onion Pesarattu recipe | ఉల్లిపాయ పెసరట్టు తయారీ విధానం



కావలసిన పదార్థాలు (Ingredients):
 
1. పెసలు(1కప్పు)
2. బియ్యం (1/4కప్పు)
3. అల్లం 
4. పచ్చిమిర్చి (3)
5. ఉప్పు 
6. జీలకర్ర(1స్పూన్)
7. ఆయిల్(1స్పూన్)

తయారీ విధానం (Recipe):
 
1) ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు పెసలు పావు కప్పు బియ్యం వేసి  ఎనిమిది గంటలు  నానబెట్టుకోవాలి.

2) ఈ  నానబెట్టిన పెసలు ను రెండు నుంచి మూడుసార్లు  శుభ్రంగా కడుక్కోవాలి.

3) ఇప్పుడు ఈ నానబెట్టిన పెసలు ను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా అల్లం, మూడు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి  కొద్దిగా నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన  పెసరపిండిలో 1 స్పూన్ జీలకర్ర వేసి  బాగా కలుపుకోవాలి.

4) పొయ్యిమీద దోశ పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత  మనం గ్రైండ్ చేసిన పెసరపిండిని పల్చని దోశ గా వేసుకోవాలి.

5) దోశ పైన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నూనె వేసి  మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి.


Post a Comment

0 Comments