1. గోంగూర(1కప్పు ఉడకబెట్టినది)
2. మీల్మేకర్ (1/3కప్పు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టినవి)
3. ఉల్లిపాయ (చిన్నముక్కలుగా తరిగినది)
4. పచ్చిమిర్చి (4)
5. అల్లంవెల్లుల్లి (1 స్పూన్ )
6. టమాటా(1)
7. ఉప్పు
8. కారం
9. గరం మసాలా(1 స్పూన్)
10. నూనె (2 స్పూన్)
11. పోపు దినుసులు (పచ్చి శనగ పప్పు, ఆవాలు, చాయ పప్పు)
12. జీలకర్ర
13. కర్వేపాకు
తయారీ విధానం:
1. ముందుగా పొయ్యి మీద కడాయి ఉంచి దానిలో శుభ్రంగా కడిగిన గోంగూర వేసుకోవాలి. తర్వాత కొంచెం నీటిని పోసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ గోంగూరని చల్లార్చుకోవాలి చల్లారిన గోంగూరని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె కాగిన తరువాత ఉల్లపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
3. ఇప్పుడు టమోటా ముక్కల్ని వేసి మెత్తగా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి. తరువాత క కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఒక పది నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టిన మీల్మేకర్ ని కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
4.ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కప్పు గోంగూర ని దీంట్లో వేసుకోవాలి సరిపడా నీళ్లు పోసుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరంమసాలా వేసుకుని కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.
5. పోపు పెట్టుకోవడానికి పొయ్యి మీద కడాయి ఉంచి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత నాలుగు వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూన్ ఆవాలు , పచ్చి శనగపప్పు, చాయ మినపప్పు కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి.
6. పోపు వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అవుతుంది. ఈ కూర చపాతీ మరియు అన్నం లోకి చాలా బాగుంటుంది.

0 Comments