1. క్యాబేజ్ (1)
2. శెనగపిండి (1 కప్పు)
3. కాన్ ఫ్లోర్(పావు కప్పు)
4. బియ్యప్పిండి (అర కప్పు)
5. ఫుడ్ కలర్ (చిటికెడు)
6. నూనె (డీప్ ఫ్రై కి సరిపడా)
7. ఉప్పు ( ఒక స్పూన్)
8. కారం (ఒక స్పూన్)
9. ధనియాల పొడి (అర స్పూన్)
10. జీలకర్ర పొడి (అర స్పూన్)
11. కరివేపాకు (కొద్దిగా)
12. పచ్చిమిర్చి (4)
14. జీడిపప్పు (10)
తయారీ విధానం:
1) ఒక పాత్రలో సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకోవాలి. దానిలో లో శెనగ పిండి, కాన్ ఫ్లోర్, బియ్యప్పిండి, ఫుడ్ కలర్, కాచిన నూనె, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా నలుపుతూ కలుపుకోవాలి.
2) ఇలా కలుపుతునపుడు క్యాబేజ్ నుంచి నీరు బయటకు వస్తుంది. మనం నూనెలో పకోడీల్లా వేసుకునే లాగా క్యాబేజ్ రావాలి. నీరుసరిపోకపోతే కొద్దిగా నీటిని వేసి బాగా కలుపు కోవాలి.
3) పొయ్యి మీద బాండి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి, నూనె బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నా క్యాబేజీని నూనెలో పకోడీల్లా వేసుకోవాలి. క్యాబేజ్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి.
4) మిగిలిన క్యాబేజ్ ను కూడా ఇలాగే నూనెలో వేసుకుని క్రిస్పీగా అయిన తర్వాత బయటికి తీసుకోవాలి. అదే నూనెలో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి మరియు జీడిపప్పులు వేయించుకోవాలి. జీడి పప్పు లేకపోతే పల్లీలు కూడా వేయించుకుని కలుపుకోవచ్చు.
5) మనం ముందుగా వేయించి తీసిపెట్టుకున్న క్యాబేజి ఫ్రై లో వేసుకుంటే క్యాబేజి 65 రెడీ అవుతుంది. ఇది సాంబార్, రసం లోకి చాలా బాగుంటుంది.

0 Comments