Gutti Vankaya Curry Recipe | గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం



కావలసిన పదార్థాలు (Ingredients):

1. వంకాయలు 
2. ఉల్లిపాయలు
3 . పచ్చిమిర్చి 
4. టమాటాలు
5. ఉప్పు 
6. కారం 
7. గరం మసాల
8. పసుపు
9. పల్లీలు 
10. ధనియాలు
11. జీలకర్ర 
12. ఎండుమిర్చి
13. నువ్వులు 
14. గస గసాలు
15. యాలుకలు 
16. లవంగాలు
17. అల్లం
18. వెల్లుల్లి పేస్ట్ 
19. నూనె 
20. కొత్తిమీర
21. ఎండుమిర్చి

తయారీ విధానం:

1) పొయ్యి మీద కడాయి ఉంచి వేరుశనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, యాలుకలు, లవంగాలు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత గసగసాలు, నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.

2) ఈ చల్లారిన దినుసులను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

3) పొయ్యి మీద బాండి ఉంచి దానిలో నూనె వేసి కాగిన తరువాత రెండు చీలికలు పెట్టుకున్న గుత్తి  వంకాయలు  వేసి 10 నిమిషాలు వేయించుకుని పక్కకు తీసుకోవాలి.

4) అదే బాండీలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని దీంట్లో వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.

5) టమాటా పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని కలుపుకోవాలి. దీనిని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న వంకాయలను వేసి కలుపుకోవాలి.

6) ఒక గ్లాస్ నీటిని పోసి గుజ్జు కావలసిన విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేస్తే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది.


Post a Comment

0 Comments