Balamrutham Cake Recipe | బలామృతం కేక్ తయారీ విధానము



కావలసిన పదార్థాలు (Ingredients):

1. బాలామృతం పిండి
2. పంచదార 
3. బేకింగ్ పౌడర్ 
4. బేకింగ్ సోడా 
5. టూటీ ఫ్రూటీ 
6. వెనిలా ఎసెన్స్ 
7. నెయ్యి 
8. పాలు 
9. కోకో పౌడర్ 

తయారీ విధానం:

1) ఒక మిక్సీ జార్లో ఒక కప్ బాలామృతం పిండి, అర కప్పు పంచదార వేసి  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2) తరువాత క ఒక బౌల్ తీసుకుని దానిలో మనం గ్రైండ్ చేసిన బాలామృతం పొడిని వేసి ఒక గుడ్డు, అర కప్పు నెయ్యి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా పాలను వేసి బాగా కలుపుకోవాలి.

3) తరువాత వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకుకోవాలి. తరువాత కేక్ చేసే బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసి పైన కొద్దిగా టూటీఫ్రూటీ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్ కు విజిల్ తీసేసి 20 నిమిషాలు స్టవ్ పై బేక్ చేసుకోవాలి.

4) కేక్ బేక్ అయిన తరువాత  బౌల్ లో నుంచి  సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పైన కొద్దిగా టూటీఫ్రూటీ కోకో పౌడర్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.


Post a Comment

0 Comments