కావలిసిన పదార్థాలు (Ingredients):
1. అటుకులు
2. పల్లీలు
3. ఆవాలు
4. జీల కర్ర
5. ఉల్లిపాయ
6. పచ్చి మిర్చి
7. కరివేపాకు
8. బంగాళా దుంప
9. పసుపు
10. ఉప్పు
11. కారం
12. గరం మసాలా
13. కొత్తిమీర
14. నిమ్మ రసం
తయారీ విధానము (Recipe):
1) ముందుగా ఒక కప్ అటుకులు తీసుకుని కొంచెం వాటర్ కలుపుకుంటూ అటుకులని కలుపుకోవాలి. ఇలా కలిపిన అటుకులని 15 నుంచి 20 నిమిషాలు నానపెట్టుకోవాలి.
2) స్టవ్ మీద కడాయి ఉంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పల్లీలను పక్కన ఉంచుకోవాలి.
3) అదే కడాయి లో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీల కర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. ఈ మిశ్రమం మగ్గిన తర్వాత ఒక బంగాళా దుంపని చిన్న ముక్కలుగా కోసుకుని ఇందులో వేసుకోవాలి.
4) బంగాళా దుంప ముక్కలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి దుంపలను ఫ్రై చేసుకోవాలి. బంగాళా దుంపలు మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
5) దుంపలు మగ్గిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న అటుకులని వేసుకుని బాగా కలుపుకోవాలి. కడాయి అంచులలో వాటర్ పోసుకుని మూత పెట్టి రెండు నిముషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి.
6) ఆ తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. నిమ్మ రసం వేసి కలుపుకుంటే పోహా రెడీ అవుతుంది..
0 Comments