1. చేమదుంపలు (1/2కేజీ)
2. ఉప్పు
3. కారం
4. ఆయిల్ (2 టేబుల్ స్పూన్స్)
5. కరివేపాకు
6. పోపు దినుసులు (1టేబుల్ స్పూన్)
7. ఉల్లిపాయ (1)
8. పచ్చిమిర్చి (3)
9. ఎండుమిర్చి (2)
10. కొత్తిమీర
11. గరంమసాలా (1 స్పూన్)
తయారీ విధానం:
1) చేమదుంపలు ప్రెజర్ కుక్కర్ లో వేసి ఒక గ్లాసు నీటిని పోసి ఒక విజిల్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెజర్ పోయిన తర్వాత చేమదుంపల పై తోలు వలుచుకుని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి.
2) స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. చేమ దుంపలు వేసి బాగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
3) తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు వేసి కర్రీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
4) పోపు గిన్నె తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి.
5) మనం ముందుగా రెడీ చేసిన చేమదుంపల కర్రీ లో ఈ పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే చేమ దుంపల పులుసు రెడీ అవుతుంది.
0 Comments