1. కోడిగుడ్లు (3)
2. నూనె (డీప్ ఫ్రై కి సరిపడ)
3. శనగపిండి (1కప్పు)
4. ఉప్పు
5. కారం
6. బేకింగ్ సోడ (వంట సోడ) చిటికెడు
7. ఉల్లిపాయలు (1)
8. కొత్తిమీర
9. నిమ్మకాయ (1)
10. వామ్ముు (అరచెంచా)
11. పచ్చిమిర్చ (3)
12. చాట్ మసాలా (అరచెంచా)
తయారీ విధానం:
1) ఒక గిన్నెలో శనగపిండి, వామ్ముు, ఉప్పు, కారం, బేకింగ్ సోడ వేసి కొంచం నీటిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
2) పొయ్యి పై డీప్ ఫ్రై కి సరిపడ నూనె ఉంచి కాగిన తరువాత ఉడకబెట్టిన కోడిగుడ్లను ముందుగా తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేపి పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి వేపి పక్కకు తీసుకోవాలి.
3) బజ్జి నీ సగానికి కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి, వేపిన పచ్చిమిర్చి తో వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది.

0 Comments