1. కోడిగుడ్లు (4)
2. ఎండురాయ్యలు (కప్పు)
3. టమాటలు (3)
4. ఉల్లిపాయలు (1)
5. పచ్చిమిర్చి (3)
6. నూనె (2 టేబుల్ స్పూన్)
7. ఉప్పు
8. కారం
9. కొత్తిమీర
10. వెల్లుల్లి రెమ్మలు (5)
11.జీలకర్ర (అర స్పూన్)
తయారీ విధానం:
1) పొయ్యిమీద ఒక పాత్ర ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
2) ఒక కప్పు ఎందడురోయ్యల్ని తీసుకుని నీటిని పోసి పది నిమిషాలు నాననివ్వాలి. ఉల్లిపాయలు మగ్గినతరువత మనం ముందుగా నానబెట్టిన ఎండు రొయ్యలు వేసుకుని ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.
3) తరువాత టమాటా ముక్కలు, రుచికిసరిపడ ఉప్పు, కొద్దిగా నీళ్ళు వేసుకుని మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గినతారువాత రుచికిసరిపడ కారం వేసుకుని 10నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసుకోవాలి.
4) వెల్లుల్లి జీలకర్ర ను కచ్చపచ్చగా దంచి ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. ఆ తరువాత గ్లాస్ నీటిని పోసి నూనె పైకి తేలేవరకు ఉడికించి కొద్దిగా కొత్తిమీర వేస్తే ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు తయారవుతుంది.

0 Comments