కావలసిన పదార్థాలు (Ingredients):
1. పాలకూర (3 కట్టలు) (1 కప్)
2. పన్నీర్ (300 g)
3. ఉల్లిపాయలు (1)
4. పచ్చిమిర్చి (3)
5. బటర్ (2 టేబుల్ స్పూన్లు)
6. ఉప్పు
7. కారం
8. గరం మసాలా (1 స్పూన్)
9. జీల కర్ర (1 స్పూన్)
11. నూనె (1 టేబుల్ స్పూన్)
12. పసుపు (1స్పూన్)
13. అల్లం (కొద్దిగా)
14. వెల్లుల్లి (3 రెమ్మలు)
తయారీ విధానం:
1) స్టవ్ పైన బాండి ఉంచి కడిగిన పాలకూరని వేసి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత బాండీలో నుంచి పాలకూర ను పక్కకు తీసి చల్లార్చుకోవాలి.
2) అదే బాండీలో బటర్ వేసి కరిగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి.
3) ముందుగా ఉడికించిన పాలకూరని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4) తరువాత స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా బటర్ వేసి కాగిన తరువాత అర స్పూన్ జీలకర్ర వేసి వేగిన తరువాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పన్నీర్ క్యూబ్స్ వేసి పన్నీర్ కి మసాలాలు బాగా పట్టేలా కలపాలి.
5) కొద్దిగా గరం మసాలా వేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని దీనిలో వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత కొద్దిగా నీటిని పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.
6) అంతే పాలక్ పన్నీర్ రెడీ అవుతుంది. ఇది పుల్కా (రోటి ,చపాతి) లోకి చాలా బాగుంటుంది.

0 Comments