1. టమాటాలు (8 )
2. బాస్మతి రైస్ (4 కప్పులు)
3. నూనె (2 స్పూన్)
4. ఉప్పు
5. కారం
6. గరం మసాలా (1 స్పూన్)
7. ధనియాల పొడి (అర స్పూన్)
8. జీలకర్ర పొడి (అర స్పూన్)
9. ఉల్లిపాయలు (2)
10. పచ్చిమిర్చి (3)
11. అల్లం వెల్లుల్లి వేస్ట్ (1 స్పూన్)
12. పసుపు
13. పుదీనా
14. కొత్తిమీర
15. నెయ్యి (1 స్పూన్)
16. బిర్యానీ ఆకులు (2)
17. యాలకలు (3)
18. మిరియాలు (4)
19. లవంగాలు (5)
20. జీడిపప్పు (8)
21. నీళ్లు (5 కప్పులు)
తయారీ విధానం:
1) ఒక పాత్రలో బాస్మతి రైస్ తీసుకుని కొద్దిగా నూనె వేసి బాగా కలిపి నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి.
2) స్టవ్ మీద కుక్కర్ ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, యాలుకలు, మిరియాలు, లవంగాలు, జీడిపప్పులు వేసి వేగనివ్వాలి.
3) ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించాలి.
4) ఇప్పుడు టమోటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కల మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి.
5) తర్వాత రుచికి సరిపడా కారం, గరం మసాల పొడి వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బియ్యం వేసుకున్న కప్పుతో ఐదు కప్పుల నీటిని టమాటా కర్రీ లో వేసుకోవాలి.
6) నీళ్లు మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టిన రైస్ ని వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసి బాగా కలిపి మూతపెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. టమాటా రైస్ రెడీ అవుతుంది.

0 Comments