Beetroot Uthappam recipe | బీట్ రూట్ ఊతప్పం తయారీ విధానము



కావలసిన పదార్ధాలు (Ingredients):

1. దోశ పిండి (2 కప్పులు)
2. బీట్రూట్ (1 తురుము)
3. ఉల్లిపాయలు(1 చిన్న ముక్కలుగా) 
4. పచ్చిమిర్చి  (1 చిన్న ముక్కలుగా)
5. జీలకర్ర (1 స్పూన్)
6. కర్వేపాకు
7. కొత్తిమీర
8. ఉప్పు

తయారీ విధానం:

1) దోశ పిండి లో బీట్రూట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

2) స్టవ్ మీద పాన్ పెట్టి  వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, మనం ముందుగా రెడీ చేసి నా దోసె పిండిని ఉతప్పం ల వేసుకుని రెండువైపులా బాగా కాల్చుకోవాలి. బీట్రూట్ ఉతప్పం రెడీ అవుతుంది. పల్లీ చెట్నీ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.


Post a Comment

0 Comments