Egg Noodles Recipe | ఎగ్ నూడిల్స్ తయారీ విధానము



కావల్సిన పదార్థాలు (Ingredients):

1. నూడుల్స్
2. ఎగ్స్ (2)
3. ఉప్పు
4. కారం
5. ఉల్లిపాయ (1)
6. పచ్చిమిర్చి (2)
7. టమాటాలు (1)
8. క్యాప్సికమ్ (1)
9. కొత్తిమీర
10. షేజ్వాన్ సాస్ (1 స్పూన్)
11. టొమాటో సాస్ (1 స్పూన్) 
12. సోయాసాస్ (1 స్పూన్)
13. వెనిగర్ (1 స్పూన్)
14. గ్రీన్ చిల్లీ సాస్ (1 స్పూన్)
15. న్యూడిల్స్ మసాలా
16. నిమ్మరసం
17. స్ప్రింగ్ ఆనియన్స్

తయారీ విధానము (Recipe):

1) ఒక బౌల్ తీసుకుని న్యూడిల్స్ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి.  తర్వాత  నూడిల్స్ నుండి వాటర్ సపరేట్ చేసి మూతపెట్టి  పక్కనుంచుకోవాలి.

2) స్టవ్ మీద కడాయి పెట్టి  1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగిన తరువాత 2 ఎగ్స్ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తరువాత రుచికి సరిపడ  కారం, ఉప్పు వేసి 2 నిముషాలు  ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ మిశ్రమాన్ని  తీసి పక్కన పెట్టుకోవాలి.

3) అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి  30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి.

4) ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తరువాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి  30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి  బాగా కలిపి మూతపెట్టి టమాటా ముక్కలు మగ్గనివ్వాలి.

5) టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, వన్ స్పూన్ షేజ్వాన్ సాస్, వన్ స్పూన్ టొమాటో సాస్, వన్ స్పూన్ సోయాసాస్, వన్ స్పూన్ వెనిగర్, వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని హై ఫ్లేమ్ లో  ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి.

6) తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి న్యూడిల్స్ మసాలా కూడా వేసి  బాగా కలుపుకుని 1 నిమిషం కుక్ చేసుకోవాలి.

7) ముందుగా ఉడికించిన న్యూడిల్స్ వేసుకుని మసాలాలు బాగా పట్టించాలి. ఇప్పుడు నిమ్మరసం, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి  వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే స్పైసి ఎగ్గ్ నూడిల్స్ రెడీ అవుతాయి. నూడిల్స్ వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయి.


Post a Comment

0 Comments