కావలసిన పదార్ధాలు (Ingredients):
1. వెల్లులి రెమ్మలు (2)
2. పచ్చి సెనగ పప్పు (1 టీ స్పూన్)
3. ఆవాలు (1 టీ స్పూన్)
4. ఛాయ పప్పు (1 టీ స్పూన్)
5. జీల కర్ర (1 టీ స్పూన్)
6. ఎండు మిర్చి (1)
7. పచ్చి మిర్చి (3)
8. కరివేపాకు
9. ఉల్లిపాయ
10. సొరకాయ
11. పాలు
తయారీ విధానము (Recipe):
1) స్టవ్ పైన కడాయి ఉంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హీట్ అయినా తర్వాత రెండు వెల్లులి రెమ్మలు, ఒక టీ స్పూన్ పచ్చి సెనగ పప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ ఛాయ పప్పు, ఒక టీ స్పూన్ జీల కర్ర వేసి వేగనివ్వాలి. ఒక ఎండు మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
2) మూడు పచ్చి మిర్చి ని చిన్న చిన్న ముక్కలు గ కోసుకుని వేసుకోవాలి. పచ్చి మిర్చి మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ని చిన్న చిన్న ముక్కలు గ కట్ చేస్కుని వేసుకోవాలి.
3) ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత సొరకాయను చిన్న చిన్న ముక్కలు గ కట్ చేస్కుని వేసుకోవాలి. కూర ని బాగా కలిపి మూత పెట్టి 15 నిముషాలు కుక్ చేసుకోవాలి.
4) సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిముషాలు మగ్గనివ్వాలి. ఆ తరువాత రుచికి సరిపడా కారం వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి.
5) కూర నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒక కప్ పాలు వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. పచ్చి పాలు లేదా కాచిన పాలని తీస్కోవచ్చు.
6) పాలని సొరకాయ ముక్కలు మొత్తం పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. అంతే సొరకాయ పాలు కర్రీ రెడీ అవుతుంది.
0 Comments