కావలసిన పదార్థాలు (Ingredients):
1. నువ్వులు
2. మిరియాలు
3. లవంగాలు
4. గస గసాలు
5. జీలకర్ర
6. వెల్లులి రెమ్మలు
7. దాల్చిన చెక్క
8. పసుపు
9. మిరియాల పొడి
10. ఉప్పు
11. కోడి గుడ్లు
12. జీల కర్ర
13. పచ్చి మిర్చి
14. ఉల్లిపాయ
15. టమాటో పేస్ట్
16. అల్లం వెల్లులి పేస్ట్
17. పాలు
18. గరం మసాలా
19. కొత్తిమీర
తయారీ విధానము (Recipe):
1) ఒక స్పూన్ నువ్వులు, మిరియాలు, లవంగాలు, ఒక స్పూన్ గస గసాలు, జీలకర్ర, వెల్లులి రెమ్మలు, దాల్చిన చెక్క. ఈ దీనిసులని మెత్తని పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోవాలి.
2) స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు వేసి ౩౦ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఉడకపెట్టిన కోడి గుడ్లని ఒక చీలిక పెట్టి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి.
3) ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత బాండీ లో నుంచి తీసి పక్కన పట్టుకోవాలి. అదే కడాయి లో రెండు స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి,
4) ఒక స్పూన్ జీల కర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలర్ చేంజ్ అయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటో పేస్ట్ ని ఇందులో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
5) ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్, ముందు గా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. కర్రీ అడుగు అంటుతుంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి.
6) ఆయిల్ పైకి తేలుతునపుడు ముందు గా ఫ్రై చేసుకున్న కోడి గుడ్లని ఇందులో వేసి కలుపుకోవాలి. తరవాత ఒక గ్లాస్ వాటర్ పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి.
7) ఇపుడు రెండు స్పూన్స్ పాలు వేసి కలుపుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఉడికించోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి. అర స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
0 Comments