కావలసిన పదార్థాలు (Ingredients):
1. అన్నం
2. ఉప్పు
3. పసుపు
4. నిమ్మరసం
5. పల్లీలు
6. జీడీ పప్పులు
7. పచ్చి మిర్చి
8. పచ్చి సెనగ పప్పు
9. ఛాయా మినప పప్పు
10. కరివేపాకు
11. యండు మిర్చి
12. ఇంగువ
13. క్యారెట్
తయారీ విధానము (Recipe):
1) ఉడికించుకున్న అన్నం లో ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇపుడు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి.
2) స్టవ్ పైన కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినా తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కడాయి లో నుంచి తీసి ముందుగా మిక్స్ చేసుకున్న అన్నం లో వేసుకోవాలి. అదే ఆయిల్ లో జీడీ పప్పులు, పచ్చి మిర్చి వేసి వేయించుకుని అన్నం లో కాపులుకోవాలి.
3) పులిహోర లోకి పోపు తయారు చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి ఉంచి ఆయిల్ వేసి హీట్ అయ్యాక అర స్పూన్ పచ్చి సెనగ పప్పు, అర స్పూన్ ఛాయా మినప పప్పు వేసి వేపుకోవాలి. తరువాత కరివేపాకు, రెండు యండు మిర్చి వేసి వేగనివ్వాలి. ఇందులో ఇంగువ వేసుకుని రెండు నిముషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4) ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత తురిమిన క్యారెట్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కానీ నిమ్మరసం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. మొత్తాన్ని సరిగా కలుపుకుంటే పులిహోర రెడీ!

0 Comments