కావలసిన పదార్థాలు (Ingredients):
1. గోంగూర (1 కప్)
2. టమాటాలు (4)
3. ఉల్లిపాయ (1)
4. పచ్చిమిర్చి (3)
5. ఉప్పు
6. కారం
7. అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 స్పూన్)
8. గరం మసాలా (1 స్పూన్)
9. ఆయిల్ (1 టేబుల్ స్పూన్)
10. శనగపప్పు (1 స్పూన్)
11. పచ్చిశనగపప్పు (1 స్పూన్)
12. మినప్పప్పు (1 స్పూన్)
13. ఆవాలు (1స్పూన్)
14. జీలకర్ర (1స్పూన్)
15. పసుపు (చిటికెడు)
16. ఎండుమిర్చి (1)
1) స్టవ్ పై కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగనివ్వాలి.
2) ఆయిల్ కాగిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
3) పోపు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
4) తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలిపి టమాట ముక్కలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.
5) టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.
6) ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
7) ఒక కప్పు ఉడికించిన గోంగూర వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉడికించుకోవాలి.
8) తరువాత 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే గోంగూర టమాటా కర్రీ రెడీ అవుతుంది.
0 Comments